Anand mahindra:-నిజానికి ఏ కంపెనీ ఓనర్ అయినా తమ ప్రోడక్ట్ గురించి వేరే స్థాయిలో డబ్బా కొట్టుకుంటారు. తమ ప్రోడక్ట్ కి మించినది ఏదీ లేదని. వీడియోల రూపంలో, పెద్ద పెద్ద బ్యానర్స్ రూపంలో తెలుపుతూ ఉంటారు. మరికొందరు పెద్దగా యాడ్ కూడా వేస్తూ ఉంటారు. మరి ఆ విషయంలో నా రూటే వేరు.. అన్నట్టు నిరూపించారు ఓ కంపెనీ ఓనర్ అసలు ఏమైందో ఒక లుక్ వేద్దాం.
ఒక గ్రామం లో రైతులు ట్రక్ లో భారీ లోడు నింపారు. ఇద్దరు వ్యక్తులు ముందు వేలాడుతుంటే మరో ఇద్దరు ట్రాక్ నడుపుతున్నారు. ఇంతలో ఆ ట్రక్ గట్టు ఎక్కే క్రమంలో లోడ్ ఎక్కువగా ఉండి ఆ ట్రక్ ముందు టైర్లు గాల్లో పైకి ఎగిరాయి. కొంతసేపటికి ఆ టైర్లు మళ్లీ కిందకి వచ్చాయి. ఇకముందు వేలాడుతున్న ఇద్దరు పని ఊపిరిపీల్చుకున్నట్టు అయ్యింది.
ఈ విషయాన్ని ఆ కంపెనీ ఓనర్ ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. @ఆనంద్మహీంద్రా ఆనె అకౌంట్ లో ఆ సుప్రో ట్రక్ ఈ వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సొంత సొంత కంపెనీ ప్రోడక్ట్ పై ట్రోల్ చేసుకోవడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు ఆనంద్ మహీంద్ర ను మెచ్చుకుంటున్నారు.
“దీని ద్వారా కస్టమర్లకు ఎలాంటి అవసరాలు ఉంటాయో తెలిపారు. అవసరాలు అన్నీ వెలుగులోకి తెచ్చి అవసరాలకు తగిన విధంగా ఉత్పత్తులు తయారు చేస్తారు. మా ఇంజనీర్లు మహీంద్రా సుప్రో ట్రక్ ని డిజైన్ చేసేటప్పుడు అవసరాలని లెక్కలోకి తీసుకుంటారని నేను నమ్మట్లేదు” అని క్యాప్షన్ ఇచ్చాడు మహింద్ర.