Site icon 123Nellore

‘పుష్ప’ సినిమాకు మరో ప్రతిష్టాత్మక అవార్డ్‌

సినీ ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022 వేడుక ముంబై వేదికగా ఆదివారం అట్టహాసంగా జరిగింది. 2021లో విడుదలై, విశేష ఆదరణ పొందిన సినిమాలు, నటులు అవార్డులు అందుకున్నారు.

ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. దాదాసాహెబ్ మూవీ ఆఫ్ ది ఇయర్​ 2022 అవార్డుకు ‘పుష్ప’ ఎంపికైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పేర్కొంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్నా నటించింది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రల్లో నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసల సైతం అందుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.300కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.

అల్లు అర్జున్ ‘పుష్ప’తో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా ‘షేర్షా’, విక్కీ కౌశల్ ‘సర్దార్ ఉద్ధమ్’ వంటి సినిమాలు అవార్డులు దక్కించుకున్నాయి. ’83’ సినిమాలో రణవీర్ నటనకు గాను బెస్ట్ యాక్టర్ గా అవార్డు దక్కింది. కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రణవీర్.. కపిల్ దేవ్ పాత్రలో నటించారు. 1983 వరల్డ్ కప్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించారు.

 

అవార్డులు:

మూవీ ఆఫ్ ది ఇయర్ – పుష్ప: ది రైజ్

ఉత్తమ చిత్రం – షేర్షా

ఉత్తమ నటుడు – రణవీర్ సింగ్(83)

ఉత్తమ నటి – కృతి సనన్(మిమీ)

ఉత్తమ దర్శకుడు – కెన్ ఘోష్(స్టేట్ ఆఫ్ సీజ్)

అత్యుత్తమ సహకారం – ఆశా పరేఖ్

ఉత్తమ సహాయ నటుడు: సతీష్ కౌశిక్‌ (కాగజ్‌)

ఉత్తమ సహాయ నటి: లారా దత్తా (బెల్‌ బాటమ్‌)

ఉత్తమ విలన్ – ఆయుష్ శర్మ (అంతిమ్‌: ది ఫైనల్‌ ట్రూత్‌)

క్రిటిక్స్ ఉత్తమ చిత్రం – సర్దార్ ఉదం

క్రిటిక్స్ ఉత్తమ నటుడు – సిద్ధార్థ్ మల్హోత్రా(షేర్షా)

క్రిటిక్స్ ఉత్తమ నటి – కియారా అద్వానీ(షేర్షా)

పీపుల్స్ ఛాయిస్ బెస్ట్ యాక్టర్ – అభిమన్యు దస్సాని

పీపుల్స్ ఛాయిస్ ఉత్తమ నటి – రాధిక మదన్

బెస్ట్ డెబ్యూ – అహాన్‌ శెట్టి (థడప్‌)

ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం – మరో రౌండ్

ఉత్తమ వెబ్ సిరీస్ – కాండీ

వెబ్ సిరీస్‌ ఉత్తమ నటుడు – మనోజ్ బాజ్‌పేయి(ది ఫ్యామిలీమ్యాన్‌)

వెబ్ సిరీస్‌ ఉత్తమ నటి – రవీనా టాండన్

టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ – అనుపమ

టెలివిజన్ సిరీస్‌ ఉత్తమ నటుడు – షహీర్ షేక్

టెలివిజన్ సిరీస్‌ ఉత్తమ నటి – శ్రద్ధా ఆర్య

టెలివిజన్ సిరీస్‌ మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ – ధీరజ్ ధూపర్

టెలివిజన్ సిరీస్‌ అత్యంత ప్రామిసింగ్ నటి – రూపాలీ గంగూలీ

ఉత్తమ షార్ట్ ఫిల్మ్ – పౌలి

ఉత్తమ నేపథ్య గాయకుడు – విశాల్ మిశ్రా

ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ – కనికా కపూర్

ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – జయకృష్ణ గుమ్మడి

Exit mobile version