బాలీవుడ్ ప్రేమపక్షులు ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌లు గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని సిని ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కరోనా వల్ల పెళ్లి వాయిదా వేసుకుంటూ వచ్చిన ఈ లవ్ బర్డ్స్ త్వరలోనే వివాహానికి సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు పెళ్లి షాపింగ్ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సడన్‌గా రణ్‌బీర్, ఆలియా పెళ్లి చేసుకున్నారంటూ ఓ వార్త నెట్టింట గుప్పుమంది.
ఏప్రిల్ 1న వీళ్లిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారంటూ పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సాంప్రదాయ దుస్తుల్లో దండలు మార్చుకుంటున్నట్లుగా ఉన్న ఫొటోలు చూసిన నెటిజన్లు నిజంగానే వీరు పెళ్లిపీటలెక్కారనుకుని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కానీ అసలు నిజమేంటంటే.. రణ్‌బీర్, ఆలియాల పెళ్లి వార్త ఉట్టి పుకారు మాత్రమే. అభిమానులు ఈ ప్రేమజంట ఫొటోలను ఎడిట్ చేసి వాళ్లకు పెళ్లైపోయినట్లు ప్రచారం మొదలుపెట్టారు. ఎందుకిదంతా చేశారంటే ఇది ఏప్రిల్ ఫూల్స్ డేలో భాగమే అంటున్నారు. దీంతో అప్పటివరకు అదంతా నిజమేనని నమ్మిన నెటిజన్లు ఏప్రిల్ ఫూల్స్ అనగానే సరదాగా నవ్వేస్తున్నారు.
అయితే నిజంగానే ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని, ఏప్రిల్‌లోనే ఈ జంట ఒక్కటవబోతున్నారు అని బాలీవుడ్ సినీ వర్గాల్లో వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఇటీవల రణ్‌బీర్ తల్లి నీతు కపూర్ సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా స్టోర్‌లో కనిపించటం, మనీష్ కూడా ఈ మధ్య తరచుగా రణ్‌బీర్ కపూర్ ఇంటికి వెళ్లడంతో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. రణ్‌బీర్ కపూర్, అలియా భట్ వివాహ కార్యక్రమాల్లో భాగంగా నీతూ కపూర్, మనీష్ మల్హోత్రా సంప్రదింపులు జరుపుతున్నారని, అంతేకాకుండా ఈ జంట పెళ్లి వస్త్రాలు ప్రత్యేకంగా డిజైన్ చేపిస్తున్నట్లు జోరుగా ప్రచారాలు వినిపిస్తున్నాయి.మరొకవైపు అలియాభట్,రణ్‌బీర్ లు కూడా వారు నటిస్తున్న రెగ్యులర్ షూటింగ్ లకు బ్రేక్ కావాలి అని గత కొద్ది రోజులుగా షూటింగ్ కి విరామం తీసుకోవాలి అనుకుంటున్నట్లు సమాచారం. మరి వీరి పెళ్లిపై అధికారిక ప్రకటన ఏమైనా వస్తుందేమో చూడాలి.