Site icon 123Nellore

విజయ్‌ దేవరకొండతో సమంత రొమాన్స్‌?

టాలీవుడ్ స్టార్‌ హీరో దేవరకొండ కీలక పాత్రలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజాగా షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి . ఇక అది అలా ఉంటే విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నట్లు ఇటీవల టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో పూరీ జనగణమన పేరుతో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ హీరోగా నటించాల్సి ఉంది. అయితే ఆ సినిమా ఏవో కారణాల వల్ల ముందుకు పోలేదు. ఇప్పుడు అదే సినిమాను పూరీ, విజయ్‌తో చేయనున్నారని అంటున్నారు.

]actress samantha's next project with vijay devarakonda

ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా సమంత నటించబోతున్నట్లు వార్తలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. క్యూట్ లవ్ స్టోరీగా తెరపైకి రాబోయే జణగణనణ సినిమాలో ఇద్దరు లవ్ బర్డ్స్‌గా కనిపించబోతున్నారని సమాచారం. సమంత లవ్ స్టోరీ సినిమాలు చేసి కూడా చాలా కాలం అయింది. దీంతో విజయ్ దేవరకొండతో అవకాశం రాగానే సమంత వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి తెరపై వీరిద్దరి రొమాన్స్‌ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే వీరిద్దరు మహానటి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

actress samantha's next project with vijay devarakonda

సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. ఇప్పటికే శాకుంతలం షూటింగ్‌ కంప్లీట్‌ చేసిన సామ్‌ ఇప్పుడు యశోద సినిమాతో పాటు ఓ హాలీవుడ్‌ సినిమా కూడా చేస్తోంది. పూరీ- విజయ్‌ల లైగర్‌ సినిమా పూర్తవ్వగానే ఈ జణగణమణ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుందని సమాచారం.

Exit mobile version