Site icon 123Nellore

కొత్త ఏడాది తన ఇంటికి వచ్చిన గెస్ట్ గురించి చెబుతూ అందరి బాధపెట్టిన మీనా!

టాలీవుడ్ ప్రేక్షకులకు అప్పటి అందాల భామ మీనా గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సహయ నటిగా ఎక్కువగా చేస్తుంది. ఇటీవలే వచ్చిన దృశ్యం 2లో ప్రేక్షకులను మరింత మెప్పించింది.

ఇక ఈ మధ్య మీనా సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాక రాక న్యూ ఇయర్ లో తొలిసారిగా బ్యాడ్ న్యూస్ వెంటబెట్టుకొని వచ్చింది. అంతేకాకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలను హెచ్చరించింది. ఇక 2022 లో వారి ఇంటికి వచ్చిన మొదటి గెస్ట్ ఎవరో తెలిపింది.

‘2022 లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి.. మిస్టర్ కరోనా మా కుటుంబం మొత్తాన్ని ప్రేమించింది. కానీ, నేను దానికి మా ఇంట్లో స్థానం ఇవ్వను. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. బాధ్యతగా ఉండండి. కరోనా విస్తరణకు అసలు అవకాశం ఇవ్వకండి.

మీ ప్రార్ధనలో మాకు కూడా కొంత చోటు ఇవ్వండి’ అంటూ మీనా ట్వీట్ చేసింది. ఫన్నీ గా ఆసక్తికరంగా చేసిన ఆమె పోస్టు ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. కాకపోతే మీనా కుటుంబానికి కరోనా సోకడంతో ఆమె ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version