Site icon 123Nellore

ఆ అవమానాలే తనలో కసిని పెంచాయంటున్న కృతి సనన్!

Kriti Sanon : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాతో పరిచయం అయింది. కానీ ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. దాంతో ఈ అమ్మడు మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సినిమాలలో నటించలేదు. కానీ ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

Kriti Sanon

ఈ సినిమాకు డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలోనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా బాడీ షేమింగ్ చేసే వాళ్ల గురించి కొన్ని ఓపెన్ కామెంట్స్ చేసింది. సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు బాడీ షేమింగ్ కామెంట్లు బాగా ఎదురవుతూ ఉంటాయి.

ఇక తాజాగా తనకు కూడా గతంలో ఎదురైనా విషయాల గురించి తెలిపింది. తన పెదవులు చిన్నగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మొత్తం లిప్ స్టిక్ రాసి కవర్ చేయాలని అనేవారట. అలాగే నవ్వుతూ ఉంటే ముక్కు పుటలు బాగా పైకి వస్తాయని.. పెద్దగా నవ్వకూడదని, నడుము సైజు బాగా తగ్గించుకోవాలని అనేవారట.

దాంతో అలాంటి అవమానాలు తనను కసి పెంచాయని తెలిపింది. లోపాలను కాకుండా తన బలాలపై దృష్టి పెట్టానని తెలిపింది. అలా మంచి కథను ఎంచుకొని నటిగా నిరూపించుకున్నానని తెలిపింది. తమ మనోభీష్టానికి వ్యతిరేకంగా శారీరక రూపాన్ని మార్చుకోటానికి ఆడవాళ్ళు ప్లాస్టిక్ బొమ్మలు కాదు అంటూ.. ఇలాంటి మాటలు గురించి పట్టించుకోవద్దని తెలిపింది. ప్రస్తుతం తాను ఆది పురుష్ తో పాటు మరికొన్ని అవకాశాలు అందుకుంటుంది.

Exit mobile version