Site icon 123Nellore

గడ్డ కట్టే చలిలో సైనికుడి పుషప్స్… వీడియో వైరల్..!

భారత భద్రతా దళాల అధికారులు ఇటీవల కాలంలో బాగా వైరల్ అవుతున్నారు. వారు చేసే పనులు వారిని మరిత వైరల్ అయ్యేలా చేస్తున్నాయి. ఇటీవల బెంగళూరులో, కేరళలో ఇద్దరిని రక్షించి తమ సాహాన్ని ప్రదర్శించిన సైన్యం మరిన్ని విపరీతమైన వాతావరణ పరిస్థితులను కూడా ఎదుర్కొన్ని ముందుకు సాగుతుంది. అయితే మన సైనికులు దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి చాలా కష్టం పడుతారు. ఊరు పేరు తెలియని ప్రాంతాల్లో జీవిస్తారు. చలి, వేడి అనే తేడా లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే దేశ రక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతుంటారు. ఇదే సమయంలో వారి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇండో టిబెటన్ పోలీసుగా విధులు నిర్వహించే ఓ అధికారి ప్రస్తుతం వైరల్ అయ్యారు. ఇంతకీ అతను ఏం చేశారో తెలుుకుందాం.

55-year-old ITBP Commandant Ratan Singh Sonal completes 65 push-ups at one go

ఇండో టిబెటన్ పోలీసులు ఎక్కువ భాగం హిమాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది. అయితే వారు వారి శారీరక దృఢత్వాన్ని చూసుకోవడం కోసం కొన్ని వ్యాయామాలు చేస్తుంటారు. ఇలానే ఓ అధికారి 55 ఏళ్ల వయస్సులో కూడా ఏ మాత్రం అలసట లేకుండా హిమాలయాల్లోని మంచులో పుష్ప్స్ చేస్తున్నాడు. తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అలాంటి మంచు కుప్పలు తెప్పలుగా కురిసే ప్రాంతంలో కూడా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా ఇలా చేయడం ప్రస్తుతం సామాజిక మాధ్యాల్లో వైరల్ గా మారింది.

ఐదు పదులు వయసులో కూడా ఆ అధికారి చేస్తున్న పుషప్స్ గురించి నెట్టింట చాలా మంది చర్చించుకుంటున్నారు. అలాంటి వారికి ఏజ్ అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని భావిస్తున్నారు. ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాలి అనుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా అందుకు తగిన వ్యాయామాలు చేస్తామని చెప్తున్నారు. ఇతకీ అతని పేరు ఏంటి అని తెలుసుకోవాలి అనిపిస్తుంది కదూ.. అయనే కమాండెంట్ రతన్ సింగ్ సోనాల్.

Exit mobile version