Site icon 123Nellore

500 మరియు 1000 రూపాయల నోట్లను కేజీ 12 రూపాయలకు కొంటాం రండి బాబు రండి

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం అవినీతిపరుల గుండెల్లో గునపంలా మారింది. సరైన ఆదాయపు వివరాలు లేకుండా అక్రమార్కులకు బ్యాంకుల్లో తమ డబ్బును మార్పు చేసుకునే వీలు లేదు. ఈ సందర్భంపై నెటిజన్లు సామజిక అనుసంధాన వేదికల్లో జోకుల రూపం లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. చెల్లని నోట్లు చిత్తుకాగితాలుగా చిత్రీకరిస్తూ పల్లీలు, మిక్చర్ పొట్లాలు కట్టుకునే విధంగా రూపొందించి తమ ఖాతాల్లో షేరింగ్ చేస్తున్నారు. దాంతో పాటు సరదా వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు.

అందులో కొన్ని

  • 500 మరియు 1000 రూపాయల నోట్లను కేజీ 12 రూపాయలకు కొంటాం రండి బాబు రండి
  • ఇంటలెక్చువల్స్ తమ అవార్డులను తిరిగి ఇచ్చినట్లు ఇప్పుడు 500 మరియు 1000 రూపాయల నోట్లను ఇస్తారేమో!
  • మీడియా మొత్తం అమెరికా ఫలితాలు అనే సిలబస్ ను ప్రిపేర్ అయి ఉంటే మోడీ అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ ఇచ్చారు
  • కొన్ని కంపెనీలు వచ్చే నెల ఉద్యోగులకు జీతం బ్యాంకుల్లో వేయకుండా తమ దగ్గర లెక్కలు చూపలేని 500/1000 నోట్లు ఇస్తారేమో! 
  • రేపటి అవసరాలకు విజయవంతంగా ఏటీఎం నుండి 400 రూపాయలు డ్రా చేయగలిగాను, ఇప్పుడు భారతదేశంలో అత్యంత అదృష్టవంతుడిని నేనే
  • బాబ్బాబు నా దగ్గర డబ్బులు ఉన్నాయి అప్పుగా తీసుకో, వడ్డీ అవసరం లేదు, తీర్చేటపుడు క్రొత్త నోట్లు కానీ 100 నోట్లు కానీ ఇవ్వు చాలు
ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యానాలు నెటిజన్లు చేసారు.
Exit mobile version