నెల్లూరు నగరంలోని ప్రధాన కూడళ్లలో మరియు సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్నామని, ఆ ఫుటేజ్ లను ఎప్పటికప్పుడు జిల్లా పోలీసు కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉండడం జరుగున్నదని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని స్పష్టం చేసారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే కేసులు బుక్ చేసి ఈ-చలానాలు సంబంధిత వాహనదారునికి పంపుతామని తెలిపారు. చలానాలు చెల్లించకుంటే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. నో పార్కింగ్ ప్రదేశాల్లో పార్కింగ్ చేసినా, వాహనాల నెంబర్ ప్లేట్లు సరిగా లేకున్నా, రాంగ్ రూట్ డ్రైవింగ్, సీట్ బెల్ట్ లేకుండా వాహనాన్ని డ్రైవ్ చేయడం, బైక్స్ లో ట్రిపుల్ రైడింగ్ మొదలగువన్నీ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించడం జరుగుతున్నదని కేసులు నమోదు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తమ అధికారిక ఫేస్ బుక్ పేజీ ద్వారా కూడా స్పష్టం చేసారు.