విక్రమ సింహపురి యూనివర్శిటీ పరిధిలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మూడు సంవత్సరాల డిగ్రీ పరీక్షల మొదటి మరియు మూడవ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 28 నుండి డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. దీనికి సంబంధించి పరీక్షల కేంద్రాల వివరాలను వర్శిటీ తమ అధికారిక వెబ్ సైట్ లో ఉంచింది. ఈ పర్యాయం పరీక్షల నిర్వహణ గతానికి భిన్నంగా పూర్తిగా ప్రభుత్వ మరియు ఎయిడెడ్ కళాశాలల్లోనే జరగనుంది. 2016 సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగిన డిగ్రీ పరీక్షల నిర్వహణలో సెల్ఫ్ సెంటర్ల మాటున భారీ అక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. నాలుగు కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఫలితంగా మంత్రి నారాయణ కలుగజేసుకుని పరీక్షల కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయించారు. ఈ పర్యాయం కూడా సెల్ఫ్ సెంటర్లను కేటాయిస్తే ప్రజల నుండి, విద్యార్థి సంఘాల నుండి భారీ వ్యతిరేకత వస్తుందనే నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం సెల్ఫ్ సెంటర్లు రద్దు చేసారు. కేవలం ప్రభుత్వ మరియు ఎయిడెడ్ కళాశాలల్లోని జంబ్లింగ్ పద్ధతిలో పరీక్షలు జరగనున్నాయి. కళాశాలల వారీగా పరీక్షా కేంద్రాల జాబితాను దిగువన చూడవచ్చు.