500 మరియు 1000 నోట్ల మార్పుకే సమయం మొత్తం సరిపోతుండడంతో బ్యాంకుల్లో సిబ్బందికి అనేక పనులు మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు అనగా నవంబర్ 19 శనివారం నాడు బ్యాంకుల్లో నోట్ల మార్పిడి ఉండదని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మెన్ రాజీవ్ రుషి వెల్లడించారు. అయితే 60 ఏళ్ళు దాటిన వయోవృద్ధులకు మాత్రం దీనిపై వెసులుబాటు కల్పించారు. బ్యాంకుల్లో మిగతా సర్వీసులు యధాతధంగా పనిచేస్తాయని అకౌంట్ లలో డబ్బులు వేసుకుని విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపారు. వేలికి ఇంక్ మార్క్ పెట్టడం వల్ల 40 శాతం క్యూలు తగ్గాయని కూడా రుషి వెల్లడించారు. ఇదిలా ఉండగా నోట్ల మార్పిడి విధానాన్ని కేంద్రం రద్దు చేసే యోచనలో ఉంది. కేవలం బ్యాంకు అకౌంట్ లలో డబ్బులు వేసుకుని తీసుకునే అవకాశాన్నే కొన్ని రోజుల్లో కల్పించనుంది.