Site icon 123Nellore

మోహన్ లాల్ బ్లాక్ మనీ 3300 కోట్లా?

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బ్లాక్ మనీ ని పోగేశారా? అది కూడా ఒకటి, రెండు కాదు ఏకంగా మూడు వేల మూడొందల కోట్ల రూపాయలా? విస్తు గొల్పేలా ఉన్నా ఇది నిజం అంటూ ఓ వీడియో ను షేర్ చేస్తున్నారు మలయాళీలు. కువైట్ లోని ఓ మీడియా ఏజెన్సీ సైతం ఇండియా కు చెందిన ఓ సూపర్ స్టార్ ఇక్కడ 3300 కోట్లు పెట్టుబడులు పెట్టారని ధృవీకరించింది. మోహన్ లాల్ కు నోట్ల రద్దు విషయం ముందే తెలుసని అందుకే అంతా చక్కబెట్టుకుని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్పది, క్యూల్లో నోట్ల మార్పిడి కోసం నిలబడుకుంటే ఏమీ కాదంటూ సూక్తులు చెప్తున్నారని పలువురు కేరళ వాసులు ఆగ్రహంగా ఉన్నారు. ఏమో ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే!
Exit mobile version