తమది చాలా న్యాయమైన డిమాండ్ అని గత ఎనిమిదేళ్లుగా అద్దె భవనాల్లో కాలం వెళ్లదీస్తున్న విక్రమ సింహపురి యూనివర్సిటీని ఏడాది క్రితమే కాకుటూరు వద్ద చక్కగా నిర్మించి పూర్తి చేసి ఉన్న స్వంత భవనాల్లోకి తరలించాలని మూడు రోజుల క్రితమే వర్శిటీ వర్గాలకు బంద్ కు పిలుపిస్తున్నాం అని తెలియజేసి విద్యార్థుల సహకారంతో బంద్ నిర్వహిస్తుంటే పోలీసులు వచ్చి జోక్యం చేసుకుని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ఎబివిపి నాయకులు అంటున్నారు. స్థానిక యూనివర్సిటీ కళాశాల నందు బంద్ నిర్వహిస్తున్నఎబివిపి కార్యకర్తలపై వర్శిటీ ఇంచార్జ్ ప్రిన్సిపాల్ పోలీసులకు తెలియపరచగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, రగడ చోటు చేసుకుంది. విద్యార్థుల సమస్యల పై శాంతియుతంగా బంద్ నిర్వహిస్తుంటే ఇలా చేయడం అరెస్టులు చేస్తామని బెదిరించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి వర్శిటీ శాఖ అధ్యక్షులు అల్లంపాటి సాంబశివారెడ్డి, కార్యదర్శి దారా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వర్శిటీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిరసనలు చేపడుతామన్నారు. ఎబివిపి ఉపాధ్యక్షులు జయచంద్ర, ఇన్ ఛార్జ్ ప్రతాప్, సహాయ కార్యదర్శి శశికుమార్, జిల్లా కో కన్వీనర్ రఘు, జగదీశ్, రాజేష్, నరేష్, సురేంద్ర, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.