అత్యధిక స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,నెల్లూరు కి రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు దక్కింది. విజయవాడలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (APSACS) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖామంత్రి డా|| కామినేని శ్రీనివాస్ చేతుల మీదుగా రెడ్ క్రాస్ కన్వీనర్ డా|| కె.సుబ్బారావు ఈ అవార్డును అందుకున్నారు. నెల్లూరు రెడ్ క్రాస్ కృషిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. కన్వీనర్ సుబ్బారావు మాట్లాడుతూ ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ స్ఫూర్తి తో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని తెలిపారు. రక్త శిబిరాల నిర్వహణకు తోడ్పడుతున్న దాతలకు, మోటివేటర్లకు, కళాశాల యాజమాన్యాలకు, అభిమాన సంఘాల వారికి, పరిశ్రమల వారికి, స్వచ్ఛంద సంస్థల వారికి ధన్యవాదాలు తెలిపారు.