నగరంలోని వీఆర్సీ మైదానంలో జరుగుతున్ననవ్యాంధ్ర పుస్తక సంబరాల్లో ఓ స్టాల్ లో ఏర్పాటు చేసిన పుస్తకం అటు పుస్తక ప్రియులతో పాటు ఇటు సామాన్యులను సైతం ఆకట్టుకుంటున్నది. ఆ పుస్తకమే ‘మంచి నిద్ర’. ఈ పుస్తకాన్ని మన నెల్లూరీయులు ప్రముఖ సైకియార్టిస్ట్ అయిన డాక్టర్ పమిడి శ్రీనివాస తేజ రచించారు. ఈ పుస్తకంలో ఏ వయసుకు ఎంత నిద్ర అవసరం, నిద్రలేమి కలిగే అనర్థాలు ఏమిటి, ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి, నిద్రకు ఆయుష్షుకు గల సంబంధాన్ని వివరించారు. వైద్య వృత్తితో పాటు స్వతహాగా రచయిత అయిన డాక్టర్ శ్రీనివాస తేజ ఈ పుస్తకాన్ని తొలుత 2010 సంవత్సరంలో విడుదల చేసారు. ప్రతి ఎడిషనూ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ పుస్తకం నిద్ర పట్టని వారి కోసమే కాదు. నిద్ర పట్టే వారు కూడా దాన్ని కాపాడుకోవడం, సుఖంగా, ఆరోగ్యంగా నాణ్యమైన జీవితం ఎలా గడపాలనే దాన్ని వివరిస్తుందని, కలల విశ్లేషణ ఈ పుస్తకంలో విశేషమని డాక్టర్ పేర్కొన్నారు. 300 రూపాయల విలువ చేసే ఈ మంచి పుస్తకం కొనే కాపీల సంఖ్యను బట్టి డిస్కౌంట్ లభిస్తుంది.