బాహుబలి2 గ్రాఫిక్స్ ఎడిటర్ కృష్ణను పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు. సినిమాకు సంబంధించి 9 నిమిషాల నిడివిగల సీన్ ఇంటర్నెట్లో లీక్ అయినట్లు పోలీసులు తెలిపారు. నిర్మాతలు సైబర్ సెల్లో కృష్ణపై కేసు నమోదు చేశారు.ఎడిటింగ్ జరుగుతున్న స్థలంలో సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా, కొంత కీలక సమాచారం అధారంగా కృష్ణ దీనిని తస్కరించాడని చిత్ర బృందం జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని హైదరాబాద్ తీసుకువస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి సైబర్ క్రైం పోలీసులు చెక్ చేసి నిరోధిస్తే కాని ఇలాంటివి ఆపడం కష్టం అని, లేకుంటే ఇది వైరల్ ఫీవర్‌గా రెండు,మూడు గంటల్లోనే అంతటికి వ్యాపంచోచ్చని సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు.