Site icon 123Nellore

ప్రభుత్వం తక్షణం మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేసిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి

విస్తృతంగా వ్యాపిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి పై అవగాహన కల్పిస్తూ ప్రజలకు ఫ్లూ సోకకుండా మాస్కులను పంచారు ఆంధ్ర్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి. పరిస్థితులు దారుణంగా తయారవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించకపోవడం దారుణమని, తక్షణం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. నగర పాలక సంస్థ అధికారులు నగరంలో పందులే లేకుండా చేస్తామని అన్నారని, కానీ నేడు నగరంలోని ప్రతి సందు గొందుల్లో పందులు కన్పిస్తున్నాయని, అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని దుయ్యబట్టారు. నగర మేయర్ అజీజ్ ఇప్పటికైనా మేల్కొని పందుల్ని, దోమల్ని పూర్తిగా నివారించేలా ఏర్పాట్లు చేయాలని, మంచు కాలంలో సోకే స్వైన్ ఫ్లూ వ్యాధి బారినుండి నగర ప్రజలను రక్షించాలని కేతంరెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి రఘురామ్ ముదిరాజ్, నగర అధ్యక్షులు ఉడతా వెంకటరావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే అన్ని పాఠశాలల్లో విద్యార్ధులకు స్వైన్ ఫ్లూ పై అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలని అన్నారు. జలుబు చేసినప్పుడు చేతిగుడ్డలో కర్పూరం, ఏలకలు కలిపి వాసన చూస్తూ ఉంటే ఫ్లూ సోకకుండా చూసుకోవచ్చు అని అన్నారు. వ్యాధి లక్షణాలు అనిపిస్తే తక్షణం వైద్యశాలకు చేరాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో మురికివాడలు, పాఠశాలల్లో స్వైన్ ఫ్లూ నివారణ మాస్కులను పంపిణీ చేస్తామని నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో పావుజెన్ని శేఖర్ రెడ్డి, బాల సుధాకర్, వెంకటరావు, మురళిరెడ్డి, కస్తూరయ్య, మోషా, మధు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version