నెల్లూరు 32 వ డివిజన్ అక్కచెరువుపాడు, ఓగూరుపాడు, కిచ్చరగుంట తదితర ప్రాంతాల్లో శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజాబాట నిర్వహించారు. స్థానిక సమస్యల పై ప్రజలతో చర్చించి త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు పెన్షన్ల మంజూరులో తాము పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
స్పందించిన ఎమ్మెల్యే అర్హులైన వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పూర్తిస్థాయిలో పెన్షన్లు అందజేయాలని, ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదని తెలిపారు. ఓ ప్రజాప్రతినిధిగా ఎవ్వరికీ అన్యాయం జరగకుండా చూస్తానని, పెన్షన్ల మంజూరులో అన్యాయాలు జరిగితే చూస్తూ ఊరుకోనని అవసరమైతే హై కోర్టు లో ఈ విషయమై కేసు వేస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు. అదే విధంగా అర్హులైన పేదలందరికీ ప్రక్కా ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు.