Site icon 123Nellore

నోట్ల కష్టాల మీద చేసే బంద్ బ్యాంకులకూ ఉంటుందా?

నోట్ల రద్దు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విపక్షాలు నవంబర్ 28 సోమవారం నాడు భారత్ బంద్ కు పులుపిచ్చిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దు నేపథ్యంలో తీవ్ర బ్యాంకింగ్ కష్టాలను ఎదుర్కొంటున్న ప్రజలకు శనివారం, ఆదివారం బ్యాంకు సెలవుల మూలంగా మరిన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో సోమవారం నాడు విపక్షాలు జరుపనున్న బంద్ లో బ్యాంకులకు మినహాయింపు ఇచ్చి ప్రజలకు కష్టాలు లేకుండా చూస్తారా లేక మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా నోట్ల రద్దు పై ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ, భారత్ బంద్ కు వ్యతిరేకంగా లక్షలాది మంది ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంద్ ఎలా జరగనుందో వేచి చూడాలి.
Exit mobile version