Site icon 123Nellore

నెల్లూరు నగరంలో 5 రోజుల వాతావరణ పరిస్థితులు – నాడా తుఫాను ప్రభావం ఎంత?

నాడా తుఫాను ప్రభావంతో నెల్లూరు నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. చెన్నైకి ఆగ్నేయంగా కొనసాగుతున్న తుఫాను ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే నేటి పగటి పూట 27 డిగ్రీల ఉష్ణోగ్రతతో చెదురుమదురు చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నది. రాత్రి 25 డిగ్రీ ల ఉష్ణోగ్రతతో ఓ మోస్తరు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నది. డిసెంబర్ 2 న ఉదయం పూట చిరు జల్లులు, రాత్రికి గాలి వాన ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. డిసెంబర్ 3 న తుఫాను ప్రభావం నగరంలో కనిపించే అవకాశం ఉన్నది. ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన వచ్చే అవకాశం అధికం. రాత్రికి తుఫాను ప్రభావం తగ్గవచ్చు. డిసెంబర్ 4, 5 తేదీలలో కూడా చిరు జల్లులకు అవకాశం ఉన్నది. నాడా తుఫాను ప్రభావం తో ఈ అయిదు రోజులు ఉష్ణోగ్రతలు 21 నుండి 30 మధ్యలో ఉండి వాతావరణం చల్లగా ఉండే అవకాశమే అధికం. ఈదురుగాలులు గంటకు 15 కిమీ నుండి 35 కిమీ వేగం ఉండొచ్చు.
Source: Accuweather
Exit mobile version