Site icon 123Nellore

నెరవేరబోతున్న తమన్ కోరిక

సంగీత దర్శకుడిగా ‘కిక్‌’తో ప్రయాణం ప్రారంభించారు తమన్‌. తెలుగులో దాదాపుగా అగ్ర కథానాయకులందరి చిత్రాలకీ ఆయన పనిచేశారు. పలు విజయాల్ని సొంతం చేసుకొన్నారు. అయితే పవన్‌కల్యాణ్‌ సినిమాకి సంగీతం అందించే అవకాశం మాత్రం ఆయనకి దక్కలేదు. దాంతో పవన్‌తో సినిమా చేయాలనే కోరికని తమన్‌ ఎప్పట్నుంచో వెలిబుచ్చుతున్నారు. కాస్త ఆలస్యమైనా ఎట్టకేలకి ఆ కోరిక ఫలించింది. ఆర్‌.టి.నేసన్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించనున్న కొత్త చిత్రానికి సంగీతం అందించే అవకాశం తమన్‌ని వరించింది. ఆ విషయాన్ని తమన్‌ స్వయంగా ప్రకటించారు. తమిళంలో అజిత్‌ నటించిన ‘వేదాళం’కి రీమేక్‌గా రూపొందుతున్న ఆ చిత్రాన్ని ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పకుడు. గత నెలలోనే చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు.
Exit mobile version