Site icon 123Nellore

దివ్యాంగులకు మనందరం అండగా నిలుద్దామని కోరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

విధివశాత్తు దివ్యాంగులుగా జన్మించిన వారు, ప్రమాదవశాత్తు దివ్యాంగులుగా మారిన వారు తమ జీవన పోరాటంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, నిత్యం ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి అండగా నిలిచి ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే అయిదుగురు దివ్యాంగులకు దాతలు, స్నేహితుల సహకారంతో ట్రై సైకిళ్ళను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులకు బాసటగా నిలిచేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాని, ఇప్పటివరకు 400 మంది వరకు వివిధ రకాలుగా అండగా నిలిచినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని, వారు కార్యాలయాల చుట్టూ తిరగకుండా తమ వద్దకే పథకాలు అందే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.
Exit mobile version