Site icon 123Nellore

తాత్కాలిక ప్రయోజనాల కోసం ఎగబడతాం, దీర్ఘకాలిక ప్రయోజనాలను విస్మరిస్తాం

ప్రజల్లో అధికశాతం తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆశ పడతాం అని దీర్ఘకాలిక ప్రయోజనాలను విస్మరిస్తామని ఓ విద్యార్థిని మాట్లాడిన మాటలు అందరిలో ఆలోచన రేకెత్తించాయి. వివరాల్లోకి వెళితే కస్తూరిదేవి గార్డెన్స్ లో శనివారం ఇటీవల ఫౌండేషన్ కోర్సులు నేర్చుకుంటున్న విద్యార్థులతో మంత్రి నారాయణతో ముఖాముఖిని నిర్వాహకులు ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా పిల్లలను వేదికపైకి ఆహ్వానించి మాట్లాడారు. వారితో ముఖాముఖీ సంభాషించారు. కోర్సు ఉపయోగాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బోధనా తీరును సమీక్షించారు. ఈ సందర్భంలో గోపీచందన అనే ఓ విద్యార్థిని మాట్లాడుతూ తమ పాఠశాలలో 1400 మంది విద్యార్థులు ఉండగా కేవలం 150 మంది విదార్థులు మాత్రమే ఫౌండేషన్ కోర్సు వైపు వచ్చారని, వారి తల్లిదండ్రులు చంద్రన్న కానుక అంటూ 50 రూపాయలు విలువచేసే సామానుల కోసం ఉచితంగా ఇస్తారని రేషన్ షాపుల ముందు పడిగాపులు కాస్తారని అదే 2 లక్షల రూపాయల విలువ గల కోర్సును విద్యార్థులకు ఉచితంగా నేర్పిస్తుంటే పంపరని సమాజ తీరుని ప్రతిబించేలా ప్రసంగించారు. ఓ మునిసిపల్ పాఠశాల విద్యార్థిని మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుత సమాజ తీరుకు నిదర్శనం అని ఈ మాటలు విన్న పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా తల్లిదండ్రుల్లో మార్పు వచ్చి తమ పిల్లల కోసం ప్రభుత్వం అందిస్తున్న కోర్సుల్లో చేర్పించి సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నారాయణ అభిలషించారు.  
Exit mobile version