జూనియర్ సివిల్ జడ్జి గా ఎన్నికైన శ్రీరామ్ శ్రీనివాస్ కళ్యాణ్ ను నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జెడ్.పి. కాలనీ లోని వారి స్వగృహానికి వెళ్లి శాలువా, పూల బొకేలతో సత్కరించారు. జడ్జి తండ్రి ప్రముఖ న్యాయవాది శ్రీరామ్ పెద్దయ్య, తల్లి వెంకటమ్మ లను అభినందించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ జూనియర్ సివిల్ జడ్జి గా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన శ్రీరామ్ శ్రీనివాస్ కళ్యాణ్ నియమింపబడడం చాలా ఆనందంగా ఉందని భవిష్యత్తులో వృత్తిలో అద్భుతంగా రాణించి ఉన్నత పదవులు అలంకరించి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో చెక్క సాయి సునీల్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.