నవంబర్ 12 రెండో శనివారం, నవంబర్ 13 ఆదివారం దశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పాత నోట్లను రద్దు చేసి నూతన నోట్లను అమలుపరుస్తున్న కారణంగా ఈ నిర్ణయం వెలువడింది. దీంతో పాటు నవంబర్ 11 నుండి బ్యాంకుల్లో అదనపు కౌంటర్లు ఉంటాయని, అదనపు పని వేళలు కూడా ఉంటాయని, ఈ పరిస్థితులు కొన్ని రోజుల పాటు కొనసాగవచ్చునని బ్యాంకుల సిబ్బంది సహకరించాలని పేర్కొంది.