Site icon 123Nellore

ఆ చీరతో కరోనా వైరస్ కు చెక్!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎలా విజృంభించింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ని కూడా క్యాష్ చేసుకుంటున్నారు కొందరు తెలివైన వారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక చీర కడితే చాలు కరోనా వైరస్ కి చెక్ పెట్టచ్చు అంటూ ఓ వార్త తెర మీదకు వచ్చింది. ఆ వార్త చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లో రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు సరికొత్తగా చీరలు తీసుకొచ్చారు. రోగ నిరోధక శక్తి పెంచే చీరలను చూస్తే ఆయుర్‌వస్త్రా అనే పేరుతో పిలుస్తారు. మధ్యప్రదేశ్ హ్యాండ్లూమ్‌ అండ్‌ హ్యాండిక్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ ఈ చీరలను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

ఈ చీరలను రకరకాల సుగంధ ద్రవ్యాలతో తయారు చేశారని, అవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయని ఆ అధికారులు చెప్తున్నారు. వారు కేవలం చీరలను మాత్రమే కాకుండా ఇతర వస్తువులను కూడా తయారు చేసినట్టు.. అవి ధరించడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కార్పొరేషన్‌ అధికారులు చెప్తున్నారు.

రోగనిరోధక శక్తిని పెంచే ఈ చీరలు భోపాల్‌కు చెందిన వస్త్ర నిపుణుడు వినోద్‌ మాలేవర్‌ అనే వ్యక్తికి అప్పగించింది. ఈ చీరల తయారీకి సమయం పట్టడం మాత్రమే కాకుండా ఎంతో తెలివి అవసరం అని తెలిపారు. ఈ చీరలను లవంగాలు, యాలకులు, జాపత్రి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, రాయల్‌ జీలకర్ర, బే ఆకు వంటి సుగంధ ద్రవ్యాలతో చీరలను తయారు చేసినట్టు అతను వెల్లడించారు.

Exit mobile version