Site icon 123Nellore

విశాల్, తమన్నాల ‘ఒక్కడొచ్చాడు’ పాటలు విడుదల – ఈ నెల 18న చిత్రం విడుదల తేదీ ఖరారు

 
విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న తమిళ చిత్రం ‘కత్తిసండై’ అనువాద తెలుగు చిత్రం ‘ఒక్కడొచ్చాడు’ పాటలు సోమవారం విడుదలయ్యాయి. హైదరాబాద్ లో జరిగిన ఆడియో లాంచ్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆడియో సీడీలను ఆవిష్కరించారు. హీరో మాట్లాడుతూ ప్రేమ, సెంటిమెంట్, రొమాన్స్, యాక్షన్, కామెడీ సహా అన్ని అంశాలు ఈ చిత్రంలో చక్కగా కుదిరాయన్నారు. ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఈ చిత్రంలో చర్చించామన్నారు. తమిళ హాస్యనటులు వడివేలు అయిదేళ్ల తర్వాత మళ్ళీ ఈ చిత్రంలోనే నటిస్తున్నారని తెలియజేసారు. ఈ చిత్రాన్ని ఈ  నెల 18 వ తేదీన విడుదల చేస్తున్నట్లు విశాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు శ్రీదివ్య, మెహరీన్, నిర్మాతలు సి.కళ్యాణ్, టి.ప్రసన్న కుమార్, బెల్లంకొండ సురేష్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి నిర్మాత జి.హరి. దర్శకులు సూరజ్. హిప్ హాప్ సంగీతాన్ని అందించారు. మాటల రచయిత రాజేష్ ఏ మూర్తి, గేయ రచయిత డా. చల్లా భాగ్యలక్ష్మి. 
 
      

Exit mobile version