పెళ్లి కార్డు ఎస్పీ ఆఫీసు కి తెస్తే బ్యాంకుల్లో 5 లక్షల రూపాయల వరకు ఇస్తారు, అందుకు ఎస్పీ ఆఫీసులో లెటర్ ఇస్తారు అనే ప్రచారం సోషల్ మీడియా లో ఊపందుకుంది. దీనికి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని స్పందిస్తూ అది తప్పుడు ప్రచారం అని, వదంతులను నమ్మ వద్దని, రిజర్వు బ్యాంకు నుండి అలాంటి ఆదేశాలు ఏమీ లేవని ప్రజలకు స్పష్టం చేసారు. పాత నగదు మార్పు రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారమే జరగాలని ఆలా కాకుండా కమీషన్ ల పేరుతో బ్రోకర్లు వెలిస్తే వారి అంతు తేలుస్తామని హెచ్చరికలు జారీ చేసారు. డిసెంబర్ 30 లోపు కేవలం బ్యాంకుల ద్వారానే నగదు మార్పు చేసుకోవాలన్నారు. అక్రమంగా నగదు మార్పిడి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉప్పు విషయంలో సైతం వదంతులు ప్రచారంలోకి వచ్చాయని, ఉప్పు ధరల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. బుచ్చిలో కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు వ్యాపారాలు విక్రయింపులు జరిపారనే సమాచారంతో వారిని విచారిస్తున్నామన్నారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటామని, వదంతుల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలిగినా 9390777727, 1090, 1091 ఫోన్ నెంబర్ లను సంప్రదించవచ్చు అని తెలియజేసారు.