Site icon 123Nellore

వంగవీటి చిత్రం పై హై కోర్టులో కేసు వేసిన వంగవీటి రాధాకృష్ణ

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న ‘వంగవీటి’ సినిమాపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. వాస్తవాలకు విరద్ధంగా సినిమా చిత్రీకరిస్తున్నారంటూ వంగవీటి మోహనరంగా రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం దర్శకుడు రాంగోపాల్‌వర్మ, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌కు నోటీసులు జారీ చేసింది. వ్యాజ్యంపై విచారణ డిసెంబరు 2కు వాయిదా వేసింది. విజయవాడలో గతంలో జరిగిన రౌడీ రాజకీయాల నేపథ్యంలో వంగవీటి సినిమా తెరకెక్కిస్తున్నట్లు రాంగోపాల్‌ వర్మ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. వంగవీటి చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం డిసెంబరు 3న విజయవాడలో జరగనుంది. ఈ చిత్రాన్ని డిసెంబరు 23న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.
Exit mobile version