Site icon 123Nellore

రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ అయిదు జిల్లాల్లో నెల్లూరుకు నాలుగో స్థానం

కడప జిల్లాలో 3 రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి జోనల్ ఇన్స్ పైర్ సైన్సు ఫెయిర్ కు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుండి 38 ప్రదర్శనలు ఎంపిక చేసి పంపడం తెలిసిందే. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ఈ 5 జిల్లాల నుండి 338 ప్రదర్శనలు పాల్గొనగా 35 ప్రదర్శనలను ఎంపిక చేసి జాతీయ స్థాయికి పంపారు. చిత్తూరు నుండి 12, కడప నుండి 8, అనంతపురం నుండి 6, నెల్లూరు నుండి 5, కర్నూలు నుండి 4 ప్రదర్శనలు ఎంపికయ్యాయి. నెల్లూరు నుండి ఎంపికైన ప్రదర్శనల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ప్రదర్శనలే 4 ఎంపికవడం విశేషం.
జాతీయ స్థాయికి ఎంపిక కాబడ్డ విద్యార్థులు వీరే 
1. జి.నితిన్ చంద్ర, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తరుణవాయి
2. బండ్ల చందు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొండాపురం 
3. టి.వెంకటేష్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వల్లివేడు
4. బి.వంశీకృష్ణ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఊటుకూరు 
5. ఆర్.సునీల్ పవన్, నేతాజీ అప్పర్ ప్రైమరీ స్కూల్, పొదలకూరు
విద్యార్థులకు కడప జిల్లా డీఈవో ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా జ్ఞాపికలు అందుకున్నారు. ఇన్స్ ఫైర్ సైన్స్ ఫెయిర్ లో పాల్గొనే ప్రతి ఒక్క విద్యార్థికి వారి బ్యాంకు ఖాతాల్లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా 5 వేల రూపాయలు జమచేస్తామన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు 10 వేల రూపాయలు, జాతీయ స్థాయికి వెళ్లే విద్యార్థులకు 20 వేల రూపాయలు ప్రాజెక్టు ఖర్చుల క్రింద ఇస్తున్నామన్నారు. 
ఢిల్లీ లోని నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీలో జాతీయ స్థాయి ఇన్స్ ఫైర్ డిసెంబర్ 9 నుండి 11 వరకు జరగనుందని అందులో ఇక్కడ ఎంపికైన వారు పాల్గొంటారని తెలిపారు.
ఎంపికైన మన జిల్లా విద్యార్థులకు డీఈవో మువ్వా రామలింగం, ఎస్ఎస్ఏ పీవో వి.కనకనరసారెడ్డి, జిల్లా సైన్స్ అధికారి రాధారాణి అభినందనలు తెలిపారు.
Exit mobile version