జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్ నందు ఆదివారం జరిగిన కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉడతా వెంకటరావు అధ్వర్యంలో దాదాపు 100 మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
వీరిని నగర అధ్యక్షులు ఉడతా వెంకటరావు, పిసిసి అధికార ప్రతినిధి కనకట్ల ముదిరాజ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి లు కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీదున్న ఎనలేని అభిమానంతో మహిళా నాయకురాళ్ళు పద్మ, నాగలక్ష్మి, రత్నమ్మ, వెంగమ్మ వారి అనుచరులు పార్టీలో చేరడం శుభపరిణామం అని అన్నారు. నాటి ఇందిరా గాంధీ నుండి నేటి తమ నాయకురాలు సోనియాగాంధీ వరకు మహిళా సాధికారత కోసం పోరాడిన విధానాలను గుర్తుచేసుకున్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడితే బిజెపి నాయకులు అడ్డుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా మహిళలకు అండగా ఉంటుందని రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు దిశగా మహిళా కార్యకర్తలు పని చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళల చేత కేక్ కటింగ్ చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాయకులు అల్లావుద్దీన్, ఏడుకొండలు, గణపతి, నారాయణరాజు, పుట్టా నాగమ్మ, రత్నమ్మ, నాగభూషణమ్మ, వనజాక్షి, వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు.