‘బిల్లా’ సినిమా కోసం నయనతార బికినీలో కనిపించిన విషయం విదితమే. అజిత్ హీరోగా తమిళంలో వచ్చిన ఆ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. తెలుగులో అదే సినిమా ప్రభాస్ హీరోగా వచ్చింది. నయనతారకు పోటీగా అనుష్క తెలుగులో బికినీలో దుమ్మురేపిన విషయం విదితమే. చాలాకాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు నయనతార బికినీలో కన్పించబోతోందట. ఈ వయసులో బికినీ ఏంటి.? అంటూ నయనతార గురించి కోలీవుడ్ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఈ విషయమై నయనతార మాత్రం ఫుల్ క్లారిటీతో వుందట. ‘గ్లామర్ విషయంలో నాకంటూ కొన్ని అభిప్రాయాలున్నాయి.. ఏది గ్లామర్, ఏది వల్గారిటీ అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు..’ అంటూ బికినీ విషయాన్ని ప్రస్తావించకుండానే బికినీపై క్లారిటీ ఇచ్చేసింది నయనతార. అన్నట్టు, ఈ సినిమాలో రాశి ఖన్నా కూడా నటిస్తోంది. ఇద్దరు హీరోయిన్లు వున్న సినిమాలో నయనతార ఒకింత డామినేట్ చేసేలానే కన్పిస్తుంది. గ్లామర్ విషయంలో రాశి ఖన్నాని నయనతార డామినేట్ చేసేస్తుందా.? ఏమో మరి, వేచి చూడాల్సిందే.