Site icon 123Nellore

ఫ్లెమింగో ఫెస్టివల్ కు సిద్ధమవుతున్న జిల్లా యంత్రాంగం

డిసెంబర్ 28, 29, 30వ తేదీలలో మూడు రోజుల పాటు జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్ (పక్షుల పండుగ) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు పేర్కొన్నారు. ఈ పండుగ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు కేటాయించిందని తెల్పుతూ అధికారులతో పండుగ నిర్వహణకు సంబంధించి సమీక్ష జరిపారు. పండుగ నిర్వహించనున్న నేలపట్టు, బీవీపాళెం తదితర ప్రాంతాల్లో అవసరమగు మౌళిక సదుపాయాలకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛభారత్, ఎన్నారైజీఎస్ పథకాల క్రింద మరుగుదొడ్లు, త్రాగునీరు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. గెస్ట్ హౌస్ ల రిపేరుకు సంబంధించి అంచనాలు సిద్ధం చేయాలన్నారు. సూళ్లూరుపేట లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణయూ వైభవంగా నిర్వహించాలన్నారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ పండుగ రోజుల్లో సూళ్లూరుపేటలో ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా చూసే ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలని కలెక్టర్ ను కోరారు.
Exit mobile version