Site icon 123Nellore

ప్రత్యేక హోదా మౌన పోరాటానికి నెల్లూరు యువత సిద్ధం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఈ నెల 26న వైజాగ్ ఆర్కే బీచ్ లో మౌనపోరాటానికి సిద్ధమవుతున్న యువతకు అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తున్నది. ఇప్పటికే అనేక మంది వైజాగ్ వెళ్లేందుకు సిద్ధపడగా కొందరు తమ తమ ప్రాంతాల్లోనే అదే తరహా మౌన పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నారు. తాజాగా నెల్లూరు లోని యువతరం కూడా ఈ కార్యక్రమం పై సమాలోచనలు జరిపి మంగళవారం సాయంత్రానికి ఏకాభిప్రాయానికి వచ్చాయి. నెల్లూరు నగరంలోని వివిధ పార్టీల యువకులు, విద్యార్ధి నాయకులు, సాధారణ విద్యార్ధులు, యువత అందరూ కలిసి పార్టీలు, మతాలు, కులాలు, వర్గాలకు అతీతంగా మౌన పోరాటం ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు. తొలుత ఏదైనా మైదానం లో ఈ మౌన పోరాటం ఏర్పాటు చేయాలని భావించగా అనుమతుల విషయమై ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నదని నగరంలోని చిల్డ్రన్స్ పార్కు వద్ద మౌన దీక్ష చేపట్టేందుకు నిర్ణయించారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యే ఈ మౌన పోరాటంలో 
  • ఏ వ్యక్తి కూడా ఎటువంటి రాజకీయ పార్టీ జెండాను తీసుకురాకూడదు
  • ఎవ్వరూ ఏ నాయకునికి మద్దతుగా నినాదాలు చేయరాదు
  • మౌన పోరాటం కనుక వ్యక్తిగత విమర్శలకు తావు లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేదే అందరి అజెండా.
  • భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 19(b) 1949 ప్రకారం ఏదైనా జన సమూహం శాంతియుతంగా ఒక చోట చేరి చేతుల్లో ఎటువంటి ఆయుధాలు లేదా వర్కింగ్ మెటీరియల్ లేకుండా నిరసన చేపట్టవచ్చు.
  • శాంతికి భగ్నం కలిగించేలా ఎటువంటి చర్యలు కాని, ప్రసంగాలు కాని వద్దు. శాంతియుతంగా మౌన పోరాటం మేలు.
Exit mobile version