ఎపుడో వందేళ్ల క్రితం నాటి సర్వేలను చూపిస్తూ కాలువలు ఉన్నాయంటూ ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదల నివాసాలను తొలగించాలని చూస్తే చూస్తూ ఊరుకోమని ఇళ్ల తొలగింపు అధికారులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేసారు. నగరంలోని నీలగిరిసంఘం, చమ్మడివారి తోట, అరుంధతీయపాళెం, రామయ్యబడి, ఫతేఖాన్ పేట తదితర ప్రాంతాలలో మునిసిపల్ అధికారులు కాలువలకు అడ్డంగా ప్రజల ఇళ్ళున్నాయంటూ తొలగింపుకు రాగా వారిని ఆయన అడ్డుకున్నారు. తాజా పరిస్థితులను, ప్రజల స్థితిగతులను అర్థం చేసుకుంటూ అధికారులు ముందుకు వెళ్ళాలి కాని ఎప్పుడో వందేళ్ల క్రితం పత్రాలను తీసుకొచ్చి తమ ప్రతాపం చూపుతామంటే చూస్తూ ఊరుకోమని ప్రజలతో కలిసి ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని ఎమ్మెల్యే స్పష్టం చేసారు.