నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం నాడు ప్రజాబాట నిర్వహించారు. 18, 19, 20 డివిజన్ల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యేకి మాగుంట లేఅవుట్ పిచ్చిరెడ్డి కళ్యాణమండపం పరిసరాల్లో నివసిస్తున్న స్థానికులు పలు సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు. అక్కడి పార్కు స్థలంలో పార్కు నిర్మించకుండా నగరంలోని మురికి చెత్తని మొత్తం తీసుకొచ్చి వేస్తున్నారని అదో డంపింగ్ యార్డులాగా తయారైందని తీవ్ర దుర్వాసన, దోమల బెడదతో నానా ఇబ్బందులు పడుతున్నామని ప్రక్కనే ఉన్న నీటిపారుదల కాలువ గుర్రపు డెక్కతో తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నదని తమ ఆవేదనను వెలిబుచ్చారు.
స్పందించిన ఎమ్మెల్యే వెంటే వచ్చిన కమీషనర్ ను ఉద్దేశించి పార్కు స్థలాన్ని మున్సిపాల్టీ చెత్త దిబ్బలా మార్చేసి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయడం సమంజసమా అంటూ అసహనాన్ని వ్యక్తం చేసారు. తక్షణం ఆ స్థలాన్ని మట్టితో నింపి చక్కటి పార్కును నిర్మిస్తే మాగుంట లేఅవుట్, గోమతి నగర్, ఇస్కాన్ సిటీ తదితర ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడుతుందని సూచించారు. కమీషనర్ నెల రోజుల్లో సమస్యని పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డి. హేమంత్ కుమార్, కె.శ్రీనివాసులురెడ్డి, జి.శ్రీధర్ రెడ్డి, ఎ.సతీష్ కుమార్ రెడ్డి, వి.సురేష్, రామకృష్ణారెడ్డి, హజరతయ్య, సురేష్, రఘునాధరెడ్డి, శరత్ రెడ్డి, వెంకట రామిరెడ్డి, చేజెర్ల మహేష్, గోపి రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.