Site icon 123Nellore

న్యూక్లియర్ అంటూ 340 కోట్ల రూపాయల సినిమా ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ పూర్తి చేస్తాడా లేక ప్రచారం చేసి వదిలేస్తాడా?

దర్శకులు రామ్ గోపాల్ వర్మ సినిమా ప్రకటించాడు. ఇందులో ఏముందిలే ఆయన ప్రతి ఏడాది అనేక సినిమాలు ప్రకటిస్తుంటాడు. కొన్నైతే షూటింగ్ కూడా ప్రారంభించడు. అదంతా మాములే అనుకుంటున్నారా. అది నిజమే కావచ్చు కానీ ఈ సారి ఆయన ప్రకటించిన చిత్రం తాలుకూ వివరాలు అదిరిపోయేలా ఉన్నాయి మరి. ఆయన ఓ అంతర్జాతీయ చిత్రాన్ని ప్రకటించాడు. సిఎంఎ గ్లోబల్ సంస్థ 340 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించనుందని పేర్కొన్నారు. అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, యెమెన్, ఇండియా లకు చెందిన నటులు ఈ చిత్రంలో నటించనున్నట్లు పేర్కొన్నారు. అమెరికా, చైనా, రష్యా, ఇండియా లలో షూటింగ్ జరుపుతారని తెలిపారు. ‘న్యూక్లియర్’ పేరుతో నిర్మితం అవుతున్న ఈ చిత్రం అణుబాంబు నేపథ్యంలో సాగనుంది. మూడో ప్రపంచ యుద్ధానికి పరిస్థితులు ఎలా దారి తీస్తాయో ఈ చిత్రంలో చూపనున్నారు. తీవ్రవాదుల ద్వారా ముంబై నగరానికి స్మగ్లింగ్ ద్వారా వచ్చిన అణుబాంబు పేలితే ఆ పరిస్థితులు భారత్, పాకిస్థాన్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయి. ప్రపంచదేశాల మద్దతు వర్గాల వారీగా ఎలా విడిపోతుంది. ఆ పరిస్థితులు ఎలా యుద్ధానికి దారితీసి మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందో సినిమాలో చూపుతామని వర్మ తెలిపారు. చూద్దాం రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని పట్టాలెక్కించి పూర్తి చేస్తాడో లేక కొన్ని సినిమాలను ప్రకటించి పూర్తి చేయనట్టు దీన్ని కూడా వదిలేస్తాడో?  వర్మ లాంటి ప్రతిభావంతుడైన దర్శకులు ఒకవేళ ఈ చిత్రాన్ని పూర్తిచేస్తే అదో చారిత్రక చిత్రం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
  
Exit mobile version