రద్దు అయిన నోట్ల స్థానంలో నోట్ల మార్పుకి కమీషన్లను వసూలు చేస్తే సహించేది లేదని కఠిన చర్యలు ఉంటాయని నెల్లూరు ఎస్పీ విశాల్ గున్ని హెచ్చరికలు జారీ చేశారు. నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫిరెన్స్హాల్ లో బ్యాంకర్స్, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి 500 మరియు 1000 నోట్ల చెలామణి వ్యవహారంలో ఎక్కడైనా అవకతవకలకు పాల్పడినా, ప్రజలకు ఇబ్బందులు గురిచేసినా తక్షణ చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. పరిస్థితి గందరగోళంగా ఉందన్న వ్యాపారస్తుల వ్యాఖ్యలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏవైతే ఆదేశాలు జరీ చేసిందో వాటి ప్రకారమే నడుచుకోవాలని అతిక్రమిస్తే ఊరుకోమని స్పష్టం చేసారు.