నగరంలో ఏటీఎంలు తెరుచుకోలేదు. బ్యాంకుల్లో డబ్బులు అయిపోయాయి. పాత నోట్ల రద్దు నేపథ్యంలో నెల్లూరులో పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఓ ప్రక్క ఏటీఎంలు నేటి నుండి తెరుచుకుని వినియోగదారులకు సేవలు అందించాల్సి ఉండగా నగరంలో అలాంటి పరిస్థితులు కనబడట్లేదు. డబ్బులు కోసం కార్డులు పట్టుకుని తిరుగుతున్న వారికి ఒక్క ఏటీఎం కూడా తెరచి ఉన్నట్లు కనబడట్లేదు. మరోప్రక్క బ్యాంకులు వచ్చిన క్రొత్త నోట్లు అయిపోయి మరిన్ని నోట్ల కోసం వేచి చూస్తున్నాయి. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రజలకు డబ్బులు ఏటీఎంల నుండి అందకపోవడంతో చిన్నస్థాయి వ్యాపారులు నష్టపోతున్నారు. బిగ్ బజార్, రిలయన్స్ వంటి మాల్స్ లో కార్డులతో క్యాష్ లెస్ వ్యాపారం జోరుగా సాగుతున్నది. ఇలాంటి పరిస్థితులు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి.