BSNL ద్వారా త్వరలో ఫైబర్ నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ పీజిఎం మేరువ రవిబాబు తెలిపారు. ఫైబర్ నెట్ ద్వారా వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలను అందించనున్నామన్నారు. ప్రైవేట్ ఆపరేటర్ లతో పోటీని తట్టుకునేందుకు BSNL ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉంటుందని మార్కెట్ లో ధీటుగా నిలిచేందుకు ఈ సౌకర్యాన్ని తీసుకువస్తున్నామన్నారు. తొలుత బాలాజీ నగర్ పరిధిలో ఫైబర్ నెట్ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నాం అని అన్నారు. ఆ ప్రాంతంలో 200 కనెక్షన్లు లక్ష్యంగా నిర్ణయించామని, తర్వాత తిక్కన టెలిఫోన్ భవన్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం నగరం మొత్తం విస్తృత పరుస్తామని అన్నారు. ఈ ఫైబర్ నెట్ లో 249 రూపాయల నుండి 1199 రూపాయల వరకు వివిధ టారిఫ్ లు ఉన్నాయన్నారు. BSNL వారు చేపట్టనున్న ఈ మార్పు నగరంలో బలంగా ఉన్న ప్రైవేట్ ఇంటర్నెట్ సంస్థలకు ఏమాత్రం పోటీ కాగలదో భవిష్యత్తే నిర్ణయిస్తుంది.