నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం నియోజకవర్గ పరిధిలోని 38 వ డివిజన్ పరమేశ్వరి నగర్, పరమేశ్వరి అవెన్యూ ప్రాంతాల్లో ప్రజాబాట నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అదే సందర్భంలో పోట్టేపాలెం ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే వద్దకు చేరి కార్పొరేషన్ లో విలీనమైన గ్రామాల్లో ఇంటి పన్నుల పేరుతో అసలు, వడ్డీ కలిపి యూఎసి పెనాల్టీ రూపంలో వంద శాతం అదనంగా పన్నులు వేసి ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పందిస్తూ విలీన గ్రామాల ప్రజల ఇబ్బందులను, పన్నుల తీరు గురించి గతంలోనే మున్సిపల్ అధికారులతో చర్చించడం జరిగిందని, మున్సిపల్ శాఖా మంత్రి నారాయణతో కూడా సంప్రదించడం జరిగిందని, అన్ని పార్టీల కార్పొరేటర్లు గత కార్పోరేషన్ సమావేశాల్లో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపడం జరిగిందని, అయినా ఇంకా సమస్య పరిష్కారం కాలేదని మండిపడ్డారు.
తక్షణం మంత్రి నారాయణ స్పందించి తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుని యూఎసి పెనాల్టీ రద్దు చేసి ప్రజలకు పన్నుల భాగం తగ్గించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మురళీ యాదవ్, ఉడతా మధు యాదవ్, వాసుదేవ రావు, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.