Site icon 123Nellore

ఈ నెల 28 న భారత్ బంద్

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 500 మరియు 1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తో ఈ నెల 28 సోమవారం న దేశ వ్యాప్త బంద్ కు పిలుపిచ్చాయి విపక్షాలు. ఈ బంద్ కు దేశం లోని 13 పార్టీలు మద్దతిస్తున్నాయి. నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ పార్టీల నాయకులు పేర్కొంటున్నారు. భారత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతును ఇస్తున్నది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నిరసనలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాయి పలు పార్టీలు. లోక్ సభలో అడిగే ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానాలు చెప్పట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ పార్టీల నేతలు.  కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జనతాదళ్, BSP, డీఎంకే, ఆమ్ ఆద్మీ తదితర పార్టీలు భారత్ బంద్ కు మద్దతిస్తున్నాయి.
Exit mobile version