Site icon 123Nellore

అక్రమంగా డబ్బు వెనకేసుకున్న వారి పరిస్థితి ఏమిటి?

ప్రభుత్వ లెక్కల ప్రకారం 3 లక్షలు కూడా విలువ చేయని ఎకరా భూమిని డిమాండ్ ఉంది కదా అని కోటి రూపాయల వరకు అమ్ముతారు. ఈ లావాదేవీల క్రమంలో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో కట్టాల్సిన పైకానికి తక్కువ విలువ చూపి ప్రభుత్వానికి కట్టాల్సినంత డబ్బు కట్టకుండా ఎగ్గొడుతారు. ఇదీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తరచుగా జరిగే పని. ఇప్పుడు ఆలాంటి వారి పరిస్థితి గందరగోళంగా మారింది. 500 మరియు 1000 రూపాయల నోట్ల రద్దుతో ప్రజలు వారి దగ్గరున్న డబ్బును బ్యాంకుల్లో తగిన ఆదాయ వివరాలు మరియు ఆధార్ లేదా పాన్ కార్డు వివరాలతో మార్పు చేసుకోవాల్సి ఉన్నది. కానీ ఇప్పుడు అక్రమ మార్గాల్లో డబ్బు వెనకేసుకున్న ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో చుక్కలు కనపడనున్నాయి. అలానే అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంటూ లంచం వెనకేసుకున్న ప్రబుద్ధులు కూడా ఇక మీదట తమ లావాదేవీల వివరాలు, డబ్బు మార్పు బ్యాంకుల ద్వారానే జరపాల్సి ఉంది. వారందరికీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఊహించని షాక్. ఇలాంటి డేరింగ్ నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని దేశ ప్రజలు ఎంతగానో కీర్తిస్తూ తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Exit mobile version